logo

కేజీబీవీ లో చదువుతున్న తమ బిడ్డల్ని చూడాలన్న ఆశతో వచ్చిన తల్లిదండ్రులకు అనుమతించని సిబ్బంది **గంటల తరబడి గేటు బయట ఎండలో నిలబెడుతున్న కేజీబీవీ సిబ్బంది, **తల్లిదండ్రులని చూస్తే విద్యార్థినిలకు కొండంత ఆత్మస్థైర్యంతో చదువుతారు అదే పేగు బంధం అంటే, **కేజీబీవీ సిబ్బంది పట్ల విద్యార్థినిలు తల్లిదండ్రుల ఆగ్రహం,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **చండ్రుగొండ మండలం **(ఆగస్టు 24 ) ఏఐఎంఏ మీడియా

*తమ బిడ్డలని చూసుకోవటానికి వచ్చిన తల్లిదండ్రులకు కేజీబీవీలో చేదు అనుభవం!?

*ఎండలో గేటు బయట బిడ్డల కోసం గంటల కొద్ది ఎదురుచూస్తూ గడిపిన తల్లిదండ్రులు,

*కేజీబీవీ హాస్టల్ సిబ్బంది తీరుపట్ల తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తు సెలవు రోజు కూడా పిల్లల్ని కలవకుండా నిబంధనల పట్ల ఆగ్రహం ,

- ఎమ్మెల్యే గారు మా పిల్లల్ని చూడటానికి కూడా మాకు ఆంక్షలేనా..!.? ఇది ఎంతవరకు న్యాయం,

చండ్రుగొండ, ఆగష్టు 24:(ఏఐఎంఏ మీడియా)
స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కే జీ బీ వీ) లో ఆదివారం సెలవు దినం కావడంతో తమ బిడ్డల్ని చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను విద్యాలయం లోకి అనుమతించక పోవడంతో ఎండలో రోడ్డు పైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన స్థానిక కేజీబీవీ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... చండ్రుగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 360 మంది విద్యార్థినీ లు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను విద్యాలయం (హాస్టల్) సిబ్బంది సమయ నిబంధనలు పెట్టి లోనకు అనుమతించక పోవడంతో మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నడి ఎండలో గేటు ముందు కూర్చుని ఎదురుచూస్తున్న ఘటన అందరినీ కలిచి వేసింది. తల్లిదండ్రులను ఒంటి గంట తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పడంతో తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కు తోచక నడి ఎండలో రోడ్డుపైనే గేటు ముందు కూర్చుని ఉండిపోయారు. ఒంటిగంటైనా కూడా ఇంకా గేట్లు తీయకపోవడంతో సిబ్బంది తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కొంతమంది తల్లిదండ్రులు మీడియా కు సమాచారం తెలపడంతో అక్కడికి వచ్చిన మీడియా వాళ్లు ఫోటోలు, వీడియోలు, చిత్రీ కరిస్తుండగా అది గమనించిన సిబ్బంది హుటాహుటిన వచ్చి గేట్లు తీసి తల్లిదండ్రులను లోనికి అనుమతించారు. ఇదే విషయంపై తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. ఈరోజు మేము మాట్లాడినట్లు ఫోటోలు, వీడియోలు, బయటికి వస్తే రేపటినుంచి తమ పిల్లలను ఎక్కడ ఇబ్బందులు గురిచేస్తారేమోనని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సార్ తమ పిల్లలను చూసేందుకు కూడా మాకు ఆంక్షలేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా పిల్లలను సెలవు దినాల్లో చూసేందుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని ఎమ్మెల్యే సార్ కలగ చేసుకోవాలని వేడుకున్నారు.

ఇదే విషయంపై చండ్రుగొండ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత ను వివరణ కోరగా..
ప్రతి ఆదివారం తల్లిదండ్రులు పిల్లల్ని కలవడానికి వస్తుండటంతో సిబ్బంది విధులకు ఆటంకం కలుగుతుందన్నారు. కావున ప్రతినెల రెండో ఆదివారం మాత్రమే తల్లిదండ్రులు రావాలని సూచించడం జరిగిందన్నారు. అయినా కూడా తల్లిదండ్రులు మా మాటను వినడం లేదన్నారు. అయినా కూడా మేము ఒంటి గంట తర్వాత లోనికి అనుమతిస్తున్నామని అన్నారు.

182
6095 views