
రేపే స్వరబృందావనం సూపర్ మెగా ఈవెంట్.
సినీ సంగీత గీతాలను అద్భుతమైన గాయనీ గాయకులతో సంగీత ప్రియులను అలరిస్తూ నూతన గాయనీగాయకులను అవకాశం కలిగించి ప్రోత్సహిస్తూ గత ఏడాది నుంచి విజయవంతంగా సంగీత విభావరిలు నిర్వహిస్తున్నటువంటి స్వరబృందావనం, రేపు అనగా ఆగస్టు 24 న సూపర్ మెగా ఈవెంట్ తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించబోతోంది.
జంటనగరాలనుంచే కాక భువనేశ్వర్, వైజాగ్, అనంతపూర్, ఏలూరు, విజయవాడ నుంచి కూడా గాయనీగాయకులు వచ్చి ఈ సూపర్ మెగాలో పాల్గొనడం విశేషం.
35 మంది గాయనీగాయకులతో దాదాపు 170 సినీ పాటలను ప్రేక్షకులకు వీక్షకులకు అందించబోతున్నట్టు స్వరబృందావనం నిర్వాహకులు రవికాంత్ మరియు శ్రీకుమార్ (రవిశ్రీ) మీడియాకు తెలిపారు.
గాయనిమణులు అభిమైత్రి, అన్నపూర్ణ, డాక్టర్ దాము రాజేశ్వరి, గాయత్రీ, గౌరీ సౌజన్య, లక్ష్మీ రెడ్డి, ఎమ్ ఎస్ లక్ష్మీ, రమాదేవి, సీతా కుమారి, సీతా రాంబాబు, శారద, శ్రీలక్ష్మి, శ్రీదేవి, శ్రీమణి, వసుధ మరియు యశోద
అలాగే గాయకులు బ్రహ్మానందం, శరత్ కృష్ణ, విజయ్ రాఘవన్, చైతన్య, వెంకట చలం, రాజ్ కుమార్, నాగేశ్వర రావు, వెంకట ప్రసాద్, రఘుబాబు, రాంబాబు, సోమయాజులు శర్మ, సుబ్బరామన్, సురేంద్ర, దీపక్, శ్రావణ్, వేదవ్యాస్, రవికాంత్ మరియు శ్రీకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ గాన ప్రతిభను ప్రదర్శించబోతున్నట్టు రవిశ్రీ తెలియాజేశారు.
హైదరాబాద్ ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్ లోని కళాభారతి సిటీ కల్చరల్ హాల్ యందు ఉదయం 8:30 నుంచీ రాత్రి 10:00 వరకు ఈ సూపర్ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు, అలాగే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్టు, ప్రేక్షకులు ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించగలరు రవిశ్రీ తెలిపారు.
యూట్యూబ్ లింక్:
1. https://youtube.com/live/hnF5Zuql3e4?feature=share
2. https://youtube.com/live/F0a6Vm9H2YU?feature=share
- తూములూరి శ్రీ కుమార్