పేపర్ మిల్లులో ప్రమాదం..
ఒకరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని మడపాంలో వంశధార పేపరు మిల్లులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఉంగటి వాసుదేవరావు (46) మృతి చెందాడు.కన్వేయర్ వద్ద ఊక మిషన్‌లో కూరుకుపోవడంతో ఈ ఘటన జరిగిట్లు తెలుస్తోంది. వాసుదేవరావు 12 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ప్రమాదం జరిగిన తరువాత మిల్లు యాజమాన్యం, కుటుంబ సభ్యు లు విషయాన్ని గోప్యంగా ఉంచారు. రాజీ కుదరకపోవడంతో విషయం వెలుగుచూసింది. యాజమా న్యం నిర్లక్ష్యమే ఘనటకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నరసన్న పేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.