logo

మల్లనకు శ్రావణ శోభితం..అభిషేకం.. అలంకారం.. అర్చన

టెక్కలి:అరారా అభిషేకాలు, అపురూపంగా అలంకరణలు, వైభవంగా అర్చనలు.. కలగలిపి శ్రావ ణ శుక్రవారం పూట అమ్మవారి ఆలయాలు కళకళలాడాయి.మహిళలు వ్రతాలు పాటించడంతో కోవెల ప్రాంగణాల్లో గాజుల చప్పుళ్లు వీనులవిందుగా వినిపించాయి. సత్సంప్రదాయ రీతుల్లో వ్రతాలు జరిగాయి.శ్రావణ మాసం సందర్భంగా టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామికి పసుపు లేపనంలో ప్రత్యేక పూజలు చేశారు. లోక కల్యాణార్థం స్వామికి పసుపు లేపనంతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులంతా అభిషేకాలు చేశారు.

2
153 views