నగరి పట్టణంలో సోమవారం ముగ్గురు దారి దోపిడీ దొంగలు అరెస్ట్, వివిధ నేరాలకు సంబందించిన సుమారు 2 లక్షల విలువ సొత్తు స్వాధీనం ---యన్. విక్రమ్, ఇన్స్పెక్టర్, నగరి.
19ఆగస్టు25 మంగళవారం : నగరి పట్టణంలో సోమవారం ముగ్గురు దారి దోపిడీ దొంగలు అరెస్ట్, వివిధ నేరాలకు సంబందించిన సుమారు 2 లక్షల విలువ సొత్తు స్వాధీనం ---యన్. విక్రమ్, ఇన్స్పెక్టర్, నగరి.
నగరి పోలీస్ స్టేషన్ పరిధి లో గత రెండు నెలలుగా, మోటార్ సైకిల్ లో ఒంటరిగా వెళ్తున్న వృద్దులను టార్గెట్ చేసి, వారిని అడ్డగించి వారి వద్ద నగదు, మొబైలు ఫోన్ లు బలవంతంగా తీసుకొని, నగదు ఇవ్వకపోతే వారిని దాడి చేసి గాయం చేసిన సంఘటన పైన నగరి పోలీస్ స్టేషన్ మూడు కేసు లు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనలను నిలుపుదల చేయడంతో పాటు, నేరం చేసిన వారిని పట్టుకోవడంకోసం, చిత్తూరు జిల్లా యస్. పి మణికంఠ చందోలు, ఐ. పి. యస్ ఆదేశాల మేరకు, నగరి సబ్-డివిజన్ అధికారి సయ్యద్ మహమ్మద్ అజీజ్ గారి స్వీయ పర్యవేక్షణ లో నగరి ఇన్స్పెక్టర్ యన్. విక్రమ్ మరియు సిబ్బంది తో వివిధ బృందాలు గా ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటలకు నగరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యన్. విక్రమ్ కి రాబడిన సమాచారం మేరకు, ఇన్స్పెక్టర్ తో పాటు, నగరి యస్.ఐ విజయ నాయక్, ట్రైనీ యస్. ఐ మారెప్ప మరియు సిబ్బంది తో పాటు బృందాలుగా ఏర్పడి, నగరి-తిరుత్తణి మెయిన్ రోడ్, కీలపట్టు వద్ద వున్న ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ సైకిల్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారిలో పాత నేరస్థుడు అయిన నగరి కాలనీ కి చెందిన సతీష్ మరియు అతని సన్నిహితులు వేలావడి కి చెందిన శంకర్@అజిత్, కరకంఠాపురం కాలనీ కి చెందిన విజయ్ గా గుర్తించడం జరిగింది. విచారణ లో భాగంగా, నగరి కాలనీ కి చెందిన సతీష్, అతని స్నేహితులతో కలసి ఒక ముఠా లాగా ఏర్పడి ఈ నేరాలు చేస్తున్నట్లు మరియు ఒక్కో నేరానికి స్నేహితులను మార్చి మార్చి నేరాలు చేసినట్లు గురించడం జరిగింది. సతీష్ మరియు అతని అనుచరులు పాల్గొన్న నేరాలు.
2024 వ సంవత్సరం లో నగరి వి. కె. యస్ లే అవుట్ లో ఒక నివాస గృహం లో తన స్నేహితులతో కలిసి ల్యాప్టాప్, ఒక టి. వి, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్ మరియు బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్లు గుర్తించి, ఈ రోజు అతని వద్ద నుండి ల్యాప్టాప్, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్ మొదలగునవి రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు లో అతని తో పాల్గొన్న మరో ఇద్దరినీ పట్టుకోవడం కోసం బృందాలు ఏర్పాటు చేయడం జరగింది.
2024 వ సంవత్సరం అక్టోబర్ నెలలో నగరి కాశీం మిట్ట వద్ద వున్న మునీశ్వర స్వామి గుడి హుండీ లో దొంగతనం చేసిన దానిలో 10,350 రూపాయలు రికవరీ చేయడం జరిగింది.
గత నెల 12 వ తేదీన అర్ధ రాత్రి సుమారు 65 సం.వయస్సు గల వ్యక్తి నడచుకుంటూ ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ కి వెళుతుండగా అతనిని బెదిరించి అతని వద్ద తీసుకున్న 35 వేల నగదు లో 27,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు లో మరో ముద్దాయి ని అరెస్ట్ చేయవలసి ఉండటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది.
గత నెల 28 వ తేదీన వడమలపేట-తిరుచానూరు రోడ్, పూడి రైల్వే స్టేషన్ వద్ద దొంగతనం చేసిన సుమారు 90 వేల రూపాయలు విలువ చేసే సుజికి యాక్సెస్ వాహనం స్వాదీనం చేసుకోవడం జరిగింది.
12ఆగస్టు 2025 మద్యాహ్నం 3.30 గంటలకి, నగరి రూరల్ మండలం లోని నాగరాజకుప్పం మడుగు వద్ద మోటార్ సైకిల్ లో పోతున్న ఒక సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ని అడ్డగించి, బెదిరించి అతని వద్ద బలవంతంగా తీసుకున్న ఒక మొబైలు ఫోన్ మరియు 200 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
12.ఆగస్టు 2025 మద్యాహ్నం 3.45 గంటలకి, నగరి రూరల్ మండలం నగరి-కె. జి కుప్పం/కృష్ణాపురం కి వెళ్ళే దారిలో 62 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తూ వుండగా అతనిని అడ్డగించి, డబ్బులు ఇవ్వమని బెదిరించి, డబ్బులు ఇవ్వకపోవడంతో అతనిని బీర్ బాటిల్ తో తల పైన కొట్టి గాయం చేసినట్లు గుర్తించడం జరిగింది.
ఇందులో ప్రధాన ముద్దాయి సతీష్ పైన నగరి పోలీస్ స్టేషన్ లో గత ఐదు సంవత్సరాలలో 09 కేసు లు వున్నట్లు, వాటిలో దొంగతనం కేసు లు, దారి దోపిడీ కేసులు, నివాస గృహాలలో దొంగతనం కేసు లు వున్నట్లు, అదే విధంగా అతని పైన తమిళనాడు అరక్కోణం లో కూడా కేసు లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
క్రింద కనబరచిన అరెస్ట్ కాబడిన ముద్దాయిల వద్ద వివిధ నేరాలకు సంబందించిన 1. 37,570 నగదు, 2. లక్ష రూపాయలు విలువ చేసే ఒక మోటార్ సైకిల్, 3. 60 వేలు రూపాయలు విలువ చేసే ఒక ల్యాప్టాప్ , ఫ్యాన్ మరియు గ్యాస్ సిలిండర్ మరియు 4. ఒక నోకియా మొబైలు ఫోన్ స్వాధీనం, మొత్తం వాటి విలువ సుమారు 2 లక్షలు గా గుర్తించడం జరిగింది.
ఈ ముద్దాయిలను పట్టుకోవడం లో ప్రతిభ చూపిన, నగరి యస్.ఐ విజయ నాయక్, ట్రైనీ యస్.ఐ మారెప్ప మరియు సిబ్బంది లోకనాధం, ఇంద్ర కుమార్, గజేంద్ర, సురేష్, నవీన్, సత్య, గోపి, రవి, కదిర్ వేలు మొదలగు వారిని అభినందించడం జరిగింది.
అరెస్ట్ కాబడిన ముద్దాయిల వివరాలు:
పి. సతీష్, వయస్సు: 19 సంవత్సరాలు, తండ్రి: ప్రేమ్ కుమార్, నగరి దళితవాడ, నగరి.
ఆర్ .శంకర్ @ అజిత్, వ. 20 సం.లు, తండ్రి: ఆర్. రాజా, వేలావడి హరిజనవాడ, నగరి మండలం.
యమ్.ఎస్.విజయ్ కుమార్ @ విజయ్, వ. 20 సం.లు, తండ్రి: యమ్.జే.సొరకాయలు, కరకంటాపురం హరిజనవాడ, నగరి మండలం.