logo

రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్ సెక్రెటరీ నసీం సుల్తానా

రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్ సెక్రెటరీ నసీం సుల్తానా తేదీ 18-08-2025 నాడు కొల్లాపూర్ మండలం లోని అమరగిరి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన చెంచు ప్రజలు మరియు గ్రామ ప్రజలతో ముఖ్య అతిథిగా హాజరైన కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ వారి యొక్క జీవన స్థితిగతులను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి, ఎవరికైనా ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి మా సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని అన్నారు. చెంచులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్ , అంత్యోదయ స్కీమ్ లకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే మా యొక్క సంస్థలైన మండల న్యాయ సేవా అధికార సంఘం, కొల్లాపూర్ కు గాని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు గానీ తెలియపరిస్తే వారికి తగు విధమైన న్యాయ సహాయం అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని కార్యదర్శి తెలిపారు. ప్రతి అమ్మాయి 18 సంవత్సరాలు , ప్రతి అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసుకోవాలి అని అన్నారు. అలా కాకుండా చిన్న వయసులోని బాల్య వివాహాలు చేసుకుంటే పుట్టబోయే పిల్లలలో మానసిక మరియు శారీరక ఎదుగుదల ఉండదు అని అన్నారు అదేవిధంగా బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా స్త్రీ శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు మన చుట్టుపక్కల ఎవరైనా చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నట్లయితే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సమాచారం అందించాలి అన్నారు బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి ప్రతి స్కూల్ మరియు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించి వారికి బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించాలి అన్నారు. అదేవిధంగా మంచినీటి సమస్య గురించి ప్రజలు విన్నవించగా, పంచాయతీ కార్యదర్శిని అడిగి సమస్య పరిష్కారం చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలను చేర్పించాలని తెలిపారు. తదితరులు పాల్గొన్నారు. తదనంతరం కొల్లాపూర్ లో విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ లోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు మండల న్యాయ సేవా సంస్థ చేదోడు వాదోడుగా ఉంటుందని కార్యదర్శి నసీమా సుల్తానా తెలిపారు. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సు SI హృషికేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల నాగరాజు, ఉపాధ్యక్షులు యన్. నిరంజన్, న్యాయవాది పి . రాజు, లోక్ అదాలత్ సిబ్బంది కేశవ రెడ్డి, భోగ హరికృష్ణ, బాలరాజు హాజరయ్యారు.

24
275 views