logo

శక్తి పీఠం శ్రీశైలం భ్రమరాంబా దేవి అమ్మవారికి కాసుల హారం సమర్పణ.

బంగారు హారం సమర్పణ తుగ్గలి నాగేంద్ర, హైదరాబాద్ వారు కుటుంబ సభ్యులతో కలిసి 100 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని (కాసులపేరు) దేవస్థానమునకు సమర్పించారు.

అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున తదితరులు ఉన్నారు.

54
4574 views