logo

*||అంగరంగ వైభవంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు||*



🌀 *విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్*

🌀 *ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు*

🌀 *పోలీసు సేవా పతకాలు, అంత్రిక్ సురక్ష పతకాలను ప్రధానం చేసిన మంత్రివర్యులు*

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు పరేడ్ గ్రౌండులో ఆగస్టు 15న అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ఫ్ మరియు ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై, జెండా ఆవిష్కరణ చేసారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, జిల్లా కలెక్టరు మరియు మెజిస్ట్రేట్ డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర మంత్రివర్యులు
కొండపల్లి శ్రీనివాస్ కు పుష్పగుచ్చాలను అందజేసి, స్వాగతం పలికారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రివర్యులును పరేడ్ పర్యవేక్షణకు గాను జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ప్రత్యేక వాహనంలో తీసుకొని
వెళ్ళారు. అనంతరం, పరేడు హాజరైన ప్రజా ప్రతినిధులను, జిల్లా అధికారులను మంత్రివర్యులు పరిచయం చేసుకొని, వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసారు. పోలీసుశాఖలో విధి
నిర్వహణలో సమర్ధవంతంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి గతంలో ప్రభుత్వం, ప్రకటించిన సేవా పతకాలను, ఆంత్రిక సురక్ష పతకాలను, మంంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రదానం చేసారు. అదే విధంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండులో పోలీసు డాగ్స్ రుబీ, లవ్లీ చేసిన విన్యాసాలు ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీసు డాగ్స్ నేరస్థులను ఏవిధంగా గుర్తిస్తుంది, ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ ను ఏవిధంగా గుర్తిస్తుందన్న విషయాలను డాగ్స్ ట్రైనర్ ఎన్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాగ్స్ హ్యాండలర్స్ వై.భరత్ కుమార్, షేక్ షాజహాన్, జె.కిషోర్ కుమార్ డెమో ద్వారా డాగ్స్ చేయించి చూపారు. అనంతరం, వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను
ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. జిల్లా సాధించిన ప్రగతిని, సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రివర్యులు తన ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేసారు. అనంతరం, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను
మంత్రివర్యులు, అధికారులు పరిశీలించారు. వివిధ శాఖల శఖటాలను వేడుకల్లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిండల్, జాయింట్ కలెక్టరు ఎస్.సేతు మాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది,
విద్యార్ధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

5
79 views