
మందమర్రిలో గంజాయి మత్తు పదార్థాలపై అడిషనల్ ఎస్సై నూనె శ్రీనివాస్ గారు అవగాహన సదస్సు నిర్వహించారు
ఆగస్టు 15 2025 :పవర్ తెలుగు దినపత్రిక: మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయి మత్తు పదార్థాలపై అడిషనల్ ఎస్సై నూనే శ్రీనివాస్ సూచనలు మందమర్రి సి ఎస్ ఎఫ్ ఏరియా ప్రాంగణంలో,పోలీసుల నిరంతర నిఘా, గస్తీలో భాగంగా మందమర్రి టౌన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
గ్రామాల్లో మరియు పట్టణాల్లో గంజాయి వినియోగం పెరిగిందని వచ్చిన సమాచారం మేరకు, యువత ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్సై శ్రీనివాస్ గారు కోరారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. , పలు అనుమానిత వ్యక్తులను విచారించారు అని తెలిపారు.ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ, "యువత, విద్యార్థులు, ప్రజలు గంజాయి వినియోగానికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లేష్ ఏఎస్ఐ మాజీ ఖాన్ హోంగార్డు శ్రావణ్ పాల్గొన్నారు