
ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
నంద్యాల జిల్లా/ పాణ్యం (AIMA MEDIA):
నంద్యాల జిల్లా పాణ్యం ఎన్ ఎస్ యు ఐ నాయకులు బత్తిని ప్రతాప్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచేసినటువంటి పాణ్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దినేష్ బాబు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్, ఆర్ పి ఎస్ యువజన రాష్ట్ర అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, ఏఐఎఫ్బి జిల్లా నాయకులు వెంకటాద్రిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ జరుపుకోవడం తమకు చాలా గర్వంగా ఉందని ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తెచ్చారని మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా ఉన్న మనలను వేరు చేయలేకపోయారని స్వాతంత్రం తరువాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ప్రజాస్వామ్యంలోని ప్రశ్నించే హక్కు కల్పించిందని అయితే ఇప్పుడున్నటువంటి ఓటమి ప్రభుత్వం ప్రజల హక్కులను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా కొన్ని ఉత్తర్వులను ఇచ్చిందని, అయితే పాఠశాలలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే హక్కు విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు లేకుండా చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు..
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన R.C NO: 30/67/2025-A&I ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కొంతమంది అక్రమార్కులకు ఈ ఉత్తర్వులు మేలు చేసే విధంగా ఉందని, మరి విద్యార్థుల విద్యార్థి సంఘాల హక్కులను కాలరాసే విధంగా బ్రిటిష్ పాలనల ఉందని ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే విద్యార్థుల హక్కులను విద్యార్థి సంఘాల హక్కులను కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర ఉద్యమం మొదలవుతుందని వారు హెచ్చరించారు..