logo

శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలకు హ్యాట్రిక్ విజయం – 100% సీట్లు కేటాయింపు.

నంద్యాల జిల్లా పాణ్యం (AIMA MEDIA):
ఇటీవల విడుదలైన EAPCET 2వ కౌన్సెలింగ్లో, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలకు వరుసగా మూడోసారి 100% సీట్లు కేటాయించబడ్డాయి అని తెలియజేసిన ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం.ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డా. ఎం. శాంతిరామ్ుడు మాట్లాడుతూ ఈ విజయానికి కారణమైన అధ్యాపకులు, అప్రాధ్యాపక సిబ్బంది, తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక అభినందనలు. విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడానికి కృషి చేస్తాము అని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీనియర్ అధ్యాపక బృందం, ఆధునిక ల్యాబ్‌లు, పరిశోధన కార్యక్రమాలు, 30కి పైగా విద్యార్థి క్లబ్బులు, ప్లేస్‌మెంట్ శిక్షణ, క్రమశిక్షణ, పాఠ్య, ఉపపాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలు, పచ్చని వాతావరణం ఈ విజయానికి ప్రధాన కారణాలు అని అన్నారు.

4
68 views