logo

తాలూకా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


తాలూకా ప్రెస్ క్లబ్ 64/2020 ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంబు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
అధ్యక్షుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ న్యాయ సలహాదారులు ప్రశాంత్ కుమార్, న్యాయ సలహాదారులు బృందావన్, ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులు కపిలవాయి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు రామలింగం, కోశాధికారి హరీష్, ప్రధాన కార్యదర్శి స్వామి, రిపోర్టర్ సహజానంద,సామాజిక సేవ కార్యకర్త రాజు జరపటి, స్థానిక జర్నలిస్టులు, విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.

18
454 views