logo

తాలూకా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోఘనంగా 79వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


అచ్చంపేట,, ఆగస్టు 15,(క్విక్ టు డే న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట,
తాలూకా ప్రెస్ క్లబ్ 64/2020 ఆధ్వర్యంలోసోమవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాలుకా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంబు. చంద్రశేఖర్,అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా
అధ్యక్షుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు పాత్రను పోషించాలని ఆయనపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ న్యాయ సలహాదారులు ప్రశాంత్ కుమార్,బృందావన్ ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రెస్ క్లబ్ పవన్ కుమార్ (గౌరవ సలహా దారులు ముద్ర దిన పత్రిక ఆర్ సీ)క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ రామలింగం, కరె.హరీష్(హెచ్, కె,6, టీవీ, సీ ఈ ఓ), గుండోజు స్వామి,(శనార్తి తెలంగాణ, క్యూ న్యూస్ , ఛానల్ సహజానంద(రాజ్ న్యూస్ ఛానల్),సామాజిక సేవ కార్యకర్త రాజు జర్పటి,స్థానిక జర్నలిస్టులు,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

14
608 views