రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
నెల్లిమర్ల డైట్ కాలేజి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని సుమారు 60 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు బుధవారం తెలిపారు. ఈ వ్యక్తి ఎరుపు రంగు గీతలు పర్ట్ వేసుకుని ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఎవరైనా గుర్తుపడితే సమీపంలోని స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.