విజయనగరం జిల్లాలో నేడు హోం మినిస్టర్ పర్యటన
విజయనగరం జిల్లాకు హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం రానున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.