లోకశాహీర్, సాహిత్య రత్న డా. అన్నభావు సాఠే జయంతి వేడుకల పోస్టర్ విడుదల
అదిలాబాద్ : లోకశాహీర్, సాహిత్య రత్న డా.అన్నభావు సాఠే 105వ జయంతి పురస్కరించుకొని ఆగస్టు 17న బంగరిగూడ, ఆదిలాబాద్‌లో జరగబోయే జయంతి ఉత్సవాల పోస్టర్‌ను బంగరిగూడ అన్నభావు సాఠే జయంతి ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సమాజ బంధువులు పాల్గొనాలని కోరారు.
ప్రజలకు, విద్యార్థులకు అన్నభావు సాఠే ఆశయాలు, సిద్ధాంతాలు తెలియజేసేందుకు ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నభావు సాఠే ఉత్సవ కమిటీ, బంగరిగూడ తెలిపింది. సమానత్వం, న్యాయం, స్ఫూర్తి విలువలను విస్తృతంగా వ్యాప్తి చేయడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.