logo

బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖార్ జైన్ , కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో భారీ వర్షాలపై చర్చించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎన్ డిఆర్ఎఫ్, ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


#Weather #AndhraPradesh #DisasterManagement #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

11
295 views