logo

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్.

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA):
నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79 వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలు కొని కార్యక్రమం ఆద్యంతం వరకు చేస్తున్న ఏర్పాటులను జెసి పరిశీలించారు. వేదిక బ్యాక్ డ్రాప్, పోలీస్ సాయిద దళాల మార్చి ఫాస్ట్ ను స్వాతంత్ర సమర యోధుల సన్మానం తదితర ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. డి ఆర్ డి ఏ, డ్వామా వ్యవసాయం, స్ర్తీసంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానం, సూక్ష్మ సేద్యం సివిల్ సప్లైస్, జిల్లాలోని తదితర శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయా చిత్ర ప్రదర్శనలు, అధికారులకు, విఐపి లకు గ్యాలరీల ఏర్పాటు మంచినీటి వసతి వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తాసిల్దార్ సత్య శ్రీనివాసులు, ఆర్డిఓ విశ్వనాథరెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి నాగరాజు,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

27
432 views