logo

రైతుబీమా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి సంబంధించి 2025-26 బీమా సంవత్సరం ఈ నెల 14 న ప్రారంభం కానుందనీ మండల వ్యవసాయ అధికారి దంతాల దివ్య అన్నారు. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు జూన్ 5 వరకు భూ భారతి లో డిజిటల్ సంతకం అయి ఉండీ, ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని 18-59 ఏళ్ల రైతులు ఈ నెల 13 వ తేది వరకు తమ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నేరుగా రైతు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతు బీమా పథకం కింద నమోదైన రైతులు ఏ విధంగా మరణించినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందుతుందనీ ఈ పథకం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందనీ అన్నారు. గతంలో అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోని రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించటం జరిగిందని తెలిపారు.

2
45 views