ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తా: శివరాత్రి కవితవిద్యాసాగర్
సంస్థాన్ నారాయణపురం:యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ అన్నారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన , 210 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, తన సొంత ఖర్చుతో ఒక విద్యా వాలంటరీని నియమించి ఏడాది పాటు వేతనం అందజేస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.