logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* అంతర్జాతీయ యువజన దినోత్సవం*

తేదీ: 12-08-2025: శేరిలింగంపల్లి చందానగర్ :ఈరోజు ఉదయము అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని BHEL లో గల శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రవీందర్ గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విచ్చేసి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *ఐక్యరాజ్యసమితి సమితివారు 2000వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 12నాడు ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ' _సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు అంతకు మించి స్థానిక యువత చర్యలు'_ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం యువతకు సంబంధించిన సమస్యలు, విద్యా, ఉపాధి, శిక్షణ, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక రంగంతో సహా వివిధ రంగాలలో యువత ప్రాధాన్యతను గురించి తెలియజెప్పటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం"* అని అన్నారు. " *యువశక్తితోనే ఏ దేశ ప్రగతియైన ఆధారపడి ఉంటుంది. యువత అంటే ఎనర్జీ, ట్రిగ్గర్ నొక్కిన తరువాత దూసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉండే బుల్లెట్ లాంటి వారే యువత"* అని అన్నారు. " *వాళ్ల అలోచనలు మెరుపు వేగం, చేతలలో చురుకుదనం, తలచుకుంటే ఏదైనా చేసి చూపించే సత్తా వాళ్ళ స్వంతం. నేటి యువతను బట్టి రేపటి భవిష్యత్తు ఉంటుంది. యువత బాధ్యతతో మెలగాలి. తమ కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని కాపాడాలి. ఈనాడు సమాజంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో క్రొత్త, క్రొత్త సాంకేతికత వచ్చింది. ఆ సాంకేతికతలను అందిపుచ్చుకొని విద్యా, ఉపాధి రంగాలలో పురోభివృద్ధి సాధించాలంటే ఏకాగ్రత, పట్టుదల, కృషి ఎంతైనా అవసరం. నేటి యువతలో అవి లోపించినాయి. దానికి కారణం నేటి యువతలో కొందరు ధూమపానం, మద్యపానము, మాదకద్రవ్యాల వంటి వాటిని అధికంగా వినియోగించడంతో పాటు తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా మరియు అంతర్జాలలో వృథా చేస్తున్నారు. ప్రపంచంలో యువశక్తి అధికంగా ఉన్న దేశాలు ఇండియా, చైనా, ఇండోనేషియా, యూ. ఎస్. ఏ., పాకిస్థాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్. భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే అత్యధిక యువశక్తి ఉన్న భారతదేశంలో ప్రభుత్వాలు ఒక దశ, దిశ నిర్దేశించి యువశక్తిని వినియోగించుకోవాలి. అలాగే యువత కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న యువతకు ధీటుగా మనదేశ యువత కూడా అన్ని ఉపాధి రంగాలలో పోటీ పడి నూతన సాంకేతికతతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే మన దేశం కూడా పురోగాభివృద్ధి చెందుతుంది"* అని అన్నారు. " *యువత విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అభ్యసించడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండట, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతను అలవరచుకోవడం మరియు పౌష్టికాహారం తీసుకొని యువత అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ది చెంది దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలి. దీనికి తల్లిదండ్రులు, పౌర సమాజం, అధ్యాపకులు, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది"* అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో విద్యార్థిని, విద్యార్థుల చేత చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని, జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడుతూ దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదన్ రావు, ప్రభాకర్, నర్సింహులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

97
5825 views