logo

కృష్ణ దొరికిండు...! పకడ్బందీగా వలపన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ఢిల్లీలో జలసాలు చేస్తూ పట్టుబడ్డ మోసగాడు
" ప్రత్యేక వాహనంలో కృష్ణను ఉట్నూర్ కు తరలించిన పోలీసులు
కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

డిజిటల్ మైక్రో ఫైనాన్స్ లో ద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఫరారైన ఎస్.కె గ్రూప్ చైర్మన్ జె. కృష్ణను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు.
అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని నష్టపోతున్న పేదలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామని ఉట్నూర్, ఆదిలాబాద్, జైనూర్ లలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయాలను ఏర్పాటు చేసిన కృష్ణ ఆ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పని చేయడానికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించాడు.
ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థుల నుంచి ఉద్యోగాల కోసం ఒకొక్కరి నుంచి ఉద్యోగ హెూ దాను బట్టి రూ. 20 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసాడు. ఇలా నిరుద్యోగుల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేసాడు. ఉద్యోగాలు కల్పించకుండా ఫరరార య్యడు. తాము మోసపోయామని బాధితులు ఉట్నూర్, ఆదిలాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గత నెల 15 న నిందితుడు కృష్ణ పై చీటింగ్ కేసు నమోదైంది.

కృష్ణ ఆచూకి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు..

ఉద్యోగాల పేరిట కుచ్చు టోపీ వేసి ఫరారైనా కృష్ణ పట్టుకొనేందుకు జిల్లా ఎస్.పి అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక పోలీసు బృం దాలను నియమించి ఆచూకీ కోసం అన్వేశించారు. పోలీసులకు అందిన ప్రత్యేక సమాచారం తో దాడులు నిర్వహించి ఆదివారం రాత్రి ఢిల్లీ లో కృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో ఉట్నూర్ కు తరలించారు. కృష్ణ స్వాహా చేసిన డబ్బుల వివరాలపై ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ఇతర అధికారులు విచారణ ప్రారంభించారు.

20
1120 views