*రైతు బీమా నమోదు చేసుకోండి:*
*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.*
(నిర్మల్ జిల్లా బ్యూరో, ఆగష్టు 10)
2025–26 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతు బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైతుల మునుపటి డేటాను ఈ నెల 12లోపు అధికారులు పునరుద్ధరిస్తారని, కొత్త నమోదు గడువు 13తో ముగుస్తుందని తెలిపారు. ఇట్టి విషయాన్ని రైతులు గమనించి, గడువులోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.