ప్రాణం పణంగా పెట్టి తమ్ముడికి చేతికి రాఖీ కట్టిన అక్క
09-08-2005 పవర్ తెలుగు దినపత్రిక: అలంపూర్ జోగులాంబ.జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎటు చూసిన వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి గ్రామాల్లో దాపరించింది.
తమ్ముడికి రాఖీ కట్టాలని భావించిన ఓ అక్క భయంతోనే గ్రామం నుంచి బయలుదేరింది. గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడు లో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టడానికి బయలుదేరింది. మానవపాడు చుట్టూ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడం... ప్రధాన మార్గంలో అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర నీళ్లు నిల్వ ఉండడంతో గ్రామం అష్టదిగ్బంధంలో ఏర్పడింది.
గ్రామానికి రావడానికి ఎటు దారి లేదు. 20 అడుగుల ఎత్తులో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జి గోడపై నడుచుకుంటూ గ్రామానికి చేరుకొని ఎట్టకేలకు రాఖీ కట్టింది. తమ్ముడికి రాఖీ కట్టడానికి రాలేమోనని... అండర్ రైల్వే బ్రిడ్జి పై ప్రమాదం అని తెలిసిన కన్ను మూసుకుని దాటేశానని ఆమె ఆనందభాష్పాలతో వివరించింది.