సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి.. అనంతలోకాలకు
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి.. అనంతలోకాలకు
Aug 10, 2025, సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి.. అనంతలోకాలకు
సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ.. ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి శృతి (24) HYDలో ఉద్యోగం చేస్తోంది. మేనమామకు రాఖీ కట్టేందుకు తల్లితో కలిసి శృతి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. అయితే మహారాష్ట్ర నుంచి సోదరుడు రావడంతో రాఖీ కట్టేందుకు శృతి.. మేనమామతో కారులో నర్మెటకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టడంతో శృతి చనిపోయింది.