భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఘనంగా వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు తమ ఇళ్లల్లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం,సకలాభీష్టాల కోసం,నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారని పలువురు మహిళలు పేర్కొన్నారు.