logo

ఏజెన్సీ ప్రాంతంలో జిఓ. నం: 3ని అమలుపరిచి ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించాలి

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి ఉపాధ్యాయుల పదోన్నతులలో అడక్వేసి అనే పదాన్ని తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతంలో జిఓ. నం: 3ని అమలుపరిచి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విన్నవించగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని మా వంతుగా ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, రాష్ట్ర కోశాధికారి శ్యామ్లాల్, రాష్ట్ర కార్యదర్శి లక్పతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపాలాల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం, జిల్లా నాయకులు బాలాజీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

0
152 views