పోచమ్మ తల్లి ఆలయానికి గాజుల నరేష్ మాధవి విరాళం
కొడిమ్యాల, ఆగస్టు 04:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఉల్లె పోచమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణ దశలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం స్థానికులు ముందుకు వస్తున్నారు.ఆలయ అభివృద్ధి అవసరాలకు గ్రామానికి చెందిన గాజుల నరేష్ మాధవి కుమారుడు నరేష్ రూ. 5,016 విరాళాన్ని సోమవారం రోజున ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు. దాత రూపంలో సహకరించిన గాజుల నరేష్ కు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే వారు వస్తు రూపేగానీ, ధనరూపేగానీ సహాయాలు చేయవచ్చని, దీనికి సంబంధించి ఆలయ కమిటీని సంప్రదించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాచకొండ చంద్రమోహన్, సభ్యులు పెన్నా మహేష్, దీకొండ సంతోష్, ఐట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.