
ఐ ఎన్ టి టి యు సి జిల్లా నేతగా ఎన్నికైన లక్ష్మణ్ నాయక్ ను ఘన సన్మానం చేసిన ఎమ్మేల్యే వంశీ కృష్ణ
నాగర్ కర్నూల్, జూలై 31,(ఎస్ బి న్యూస్):ఐ ఎన్ టీ యూ సీ నాగర్ కర్నూల్ జిల్లా నూతనఅధ్యక్షునిగా లక్ష్మణ్ నాయక్ ఎన్నికైనసందర్భంగా అచ్చంపేట క్యాంపు కార్యాలయం లో శుక్ర వారం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీరాష్ట్రఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సన్మానించిఅభినందనలు తెలిపారు. ముందు ముందు భవిష్యత్తు లో పార్టీ లో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బాగా.రాబోయే స్ధానిక బాడీ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా ఐఎన్టీయూసీ విభాగం బలంగా పనిచేయాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐ ఎన్ టి యు సి గత ఎన్నిక ల్లో ఐఎన్టీయూసీ విభాగం ఎంతో కష్టపడ్డారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా గెలుపు కోసం కష్టపడాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పలు సూచనలు సలహాలను సూచించారు. ఐ ఎన్ టి యుసి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి ఐ ఎన్ టి యూ సీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయిన లక్ష్మణ్ నాయక్ కు నియామకపత్రాన్నిఅందజేశారన్నారు . పార్టీ కొరకు కష్ట పడి టే మన పార్టీ కష్టపడ్డ వారిని గుర్తుంచు కుంటుందని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా కమిటీ హర్షం వ్యక్తం చేశారు. తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ టౌన్ అధ్యక్షులు గౌస్ బాషా బాల్మూరు మండల అధ్యక్షులు ఐ ఎన్ టి సి చందు నాయక్ మౌలానా రాజు రాములు శ్రీరాం నాయక్ రఘు వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.