logo

15 నెలల విచారణ అనంతరం ఎట్టకేలకు కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి అందచేత

కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ నివేదికను సమర్పించింది, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు నివేదిక అందజేసింది, 2024 మార్చి 14న కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల, ఆనకట్టలకు సంబంధించి విచారించింది,


115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది, కమిషన్ నివేదిక తో రాహుల్ బొజ్జా సచివాల యానికి బయలుదేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు నివేదిక సమర్పించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కారు 2024, మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది.

విచారణలోని అంశాలని క్రోడీకరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. కమిషన్ నుంచి నివేదిక తీసుకున్నామని ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావుకు అందజేస్తా మని తెలిపారు..

పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించ డంతో నివేదికలో ఏము న్నదనేది దానిపై ప్రభుత్వ, రాజకీయ అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కమిషన్ విచారణలో కాళేశ్వరం బ్యారేజీలలో లోపాలకు కారకులుగా ఎవరెవర్ని పేర్కొనబోతోంది అనేది సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది.

ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా? అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించి గత కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను పరిశీలించింది. అయితే విచారణ సందర్భంగా మెజార్టీ అధికారులు గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే మార్పులు, నిర్ణయాలు జరిగాయని కమిషన్‌కు వెల్లడించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిషన్ ఏయే అంశాలను కీలకంగా తీసుకుందని ఆసక్తికరంగా మారింది.

13
569 views