logo

ప్లాస్టిక్ కవర్లు వాడరాదు: కనిగిరి కమిషనర్

కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం పట్టణంలోని చికెన్, మటన్ షాపులను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్గించారు. ప్రజలు స్వచ్ఛందంగా టిఫిన్ బాక్స్లో మాంసం తీసుకెళ్లడం శుభపరిణామం అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్డుమీద వేయవద్దని తెలిపారు.

0
183 views