గువ్వల శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు మోసాలపై ఇంటింటి చైతన్య యాత్ర!
యస్.టి.డి.న్యూస్: శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా.సాకే శైలజనాథ్ గారి పిలుపుమేరకు బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ గువ్వల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో "ఇంటింటికీ చంద్రబాబు మోసం – మోసపూరిత హామీలు రీకాలింగ్" కార్యక్రమం మండలం లోని ఓబుళపురం,దండువారిపల్లి,ఏడావులర్తి గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ, టీడీపీ పార్టీ మేనిఫెస్టోలోని అవాస్తవాలపై అవగాహన కల్పించారు. ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి టీడీపీ యత్నిస్తున్నట్లు నేతలు విమర్శించారు.