logo

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ - బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ

- బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రికార్డుల తనిఖీ జరిగింది. ఈ తనిఖీల్లో మరింత దుర్వినియోగంతో పాటు అనేక అక్రమాలు బయట పడ్డాయని పిర్యాదు దారుడైన విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రికార్డుల పరిశీలకులు బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విలేఖరులతో మాట్లాడారు. ఈ తనిఖీల్లో బయట పడ్డ దుర్వినియోగాన్ని, అక్రమాలను, అధికారుల, పాలకుల తప్పిదాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇకనైనా అధికారులు సక్రమంగా స్పందించి చర్యలు చేపట్టక పోతే న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్ళి తగు న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రజలు, యువకులు, విద్యావంతులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అవినీతి, అక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలని వారు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తగు న్యాయం కోసం చట్ట బద్దంగా పోరాటం చేస్తామన్నారు. ఈ రికార్డుల తనిఖీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (స్వచ్ఛంద సంస్థ) జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నా రెడ్డి, జిల్లా కార్యదర్శి పల్లికొండ అనిల్, రిటైర్డ్ టీచర్ చెట్ పల్లి రాజమల్లయ్య, విడిసి కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న తదితరులు పాల్గొన్నారు.

2
386 views