logo

ముళ్లపొదలతో మూసుకుపోయిన రోడ్డు.. పట్టించుకోని అధికారులు...?

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జులై 23,కామారెడ్డి జిల్లా : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్డీ నుండి పెద్దగుల్లా తాండా వరకు రెండువసల రోడ్డు నిర్మాణం కొరకు సుమారుగా రూ. 14 కోట్లతో పనులు ప్రారంభించిన గుత్తేదారుడు చిన్నగుల్ల క్రాస్ రోడ్ వరకు వేసి అర్ధాంతరంగా నిలిపివేశారు.వాస్తవానికి ఈ రోడ్డు పెద్ద ఏడ్ది నుండి గుల్లా తాండ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు బీటీ రోడ్డు మంజూరు ఉంది.అయితే సదరు గుత్తే దారుడు నిధులు మంజూరు కావడం లేదని పనులను ఎక్కడికక్కడే నిలిపివేసినట్లు సమాచారం. దీంతో అటువైపు ఉన్న గ్రామాల ప్రజలు ప్రయాణాలకు వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటున్నారు.అంతేగాక రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ళకంపలు వాహన దారులకు తీవ్రం ఆటంకంగా మారాయి. ముఖ్యంగా రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను కనిపించకపోవడంతో అదుపుతప్పి కింద పడ్డ ఘటనలు లేకపోలేదు. రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ కంపలు ఏపుగా పెరిగి,రోడ్డును పూర్తిగా కప్పేశాయి.ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని,ముళ్ల చెట్లను తొలగించాలని వాహనదారులు,ప్రజలు వేడుకుంటున్నారు.దీంతోపాటు అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనును వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కంఠాలి,పెద్దగుల్లా చిన్నగుల్లా, పెద్దగుల్లా తాండ,అటువైపు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ గ్రామాల ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. లేనియోడల అధికారులు స్పందించే వరకు రోడ్డుపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.

1
132 views