logo

పేదలకు అండ కాంగ్రెస్ జెండా.."కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జులై 23, కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం కాటేపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 10 సంవత్సరాలుగా బిఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ కూడా పేదలకు అందించలేదని అన్నారు.ఆ ప్రభుత్వ హాయంలో కొందరి రేషన్ కార్డ్ లను,మరి కొందరి రేషన్ కార్డ్ లోని కుటుంబ సభ్యుల పేర్ల ను తొలగించారని ఆయన విమర్షించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో నూతన రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డ్ లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని తెలిపారు.రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ రేషన్ కార్డ్ లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పార్టీల కతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఇళ్లు లేని ప్రతిపేదవాడికి ఇల్లు మంజూరి చేయిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్య దర్శి బూపల్లి ప్రదీప్,రేషన్ డీలర్ అశోక్ పటేల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుమొహిద్దిన్ పటేల్, నాయకులు డాక్టర్ సంజీవ్, మల్లప్ప పటేల్, మొగులా గౌడ్, గంగా గౌడ్, ఇస్మాయిల్ పటేల్, హన్మండ్లు, సాయిలు, పెంటన్న, యూసుఫ్ పటేల్, హాజీ పటేల్, చాంద్ పాషా, శంకర్, రవి,అశోక్, మొగులయ్య, రాంచందర్, బాల్ రాజ్,గంగారాం, లాలు తదితరులు పాల్గొన్నారు.

2
77 views