
*అగ్రిగోల్డ్ భూముల భౌతిక పరిశీలన*
- *క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక రూపకల్పన*
- *విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, జులై 22 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్రభుత్వం అటాచ్ చేసిన భూముల క్షేత్రస్థాయి పరిశీలన వివరాల నివేదికను రూపొందిం చడం జరిగిందని విజయవాడ ఆర్‌డివో కె.చైతన్య అన్నారు.
రాష్ట్ర భూ పరిపాలన శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా లో మంగళవారం అగ్రిగోల్డ్ భూముల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. దీనిలో భాగంగా రెవెన్యూ, నగరపాలక సంస్థ, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేష న్స్ తదితర విభాగాలకు చెందిన జిల్లాస్థాయి కమిటీ, సీఐడీ డీఎస్‌పీ పి.శ్రీనివాస్, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్యలు గాంధీనగర్‌లోని జయరాం థియేటర్ సమీపంలోని అగ్రిగోల్డ్‌కు సంబం ధించిన ప్రభుత్వం అటాచ్ చేసిన భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత భూమిని రీ సర్వే, భౌతిక పరిశీలన నిర్వహించారు. అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూమి విలువతో పాటు మార్కెట్ విలువను కూడా లెక్కించి జిల్లా రిజిస్ట్రార్ సహకారంతో వివరాలను నివేదికలో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఆయా భూముల ప్రభుత్వ విలువ, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి, మార్కెట్ విలువను అధికారిక ఎజెన్సీ నుండి పొంది మ్యూటేషన్ పనులు పూర్తిచేయడం జరుగు తుందని ఆర్‌డివో కె.చైతన్య అన్నారు.