logo

కవితా గీతాల ప్రతిధ్వని దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు

సూర్యోదయం ప్రతినిధి,కొడిమ్యాల జూలై 22:
కొడిమ్యాల మండల కేంద్రంలోని విజ్ డమ్ విద్యాభారతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య రంగంలో చిరస్మరణీయమైన కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని సోమవారం కడ మెడ కళా సాహితీ ఆధ్వర్యంలో స్థానిక విజ్‌డం హైస్కూల్ ప్రాంగణంలో ఓ విశిష్ట కవి సమ్మేళనం నిర్వహించబడింది.ఈ సాహిత్యోత్సవంలో పలువురు ప్రముఖ కవులు పాల్గొని తమ కవితా గీతాలను శ్రోతల ముందుంచి సభను అలరించారు. ఇక్కడ మెడ కళాసాహితి అధ్యక్షులు మల్లారపు రాజయ్య, సభ్యులు ఇనుగంటి సత్యానందం,కంచర్ల గంగాచారి,చిలుముల బాబు,గుగ్గిళ్ల నాగభూషణం చారి,తైదల అంజయ్య తదితరులు పాల్గొని కవిత్వం ద్వారా దాశరథి స్ఫూర్తిని ప్రదర్శించారు.కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీకొండ అశోక్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.సాహిత్యంపై విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఈ కార్యక్రమం సాగింది.స్థానికులు ఈ సభను ప్రశంసించారు.

0
163 views