logo

డిప్లొమా ఇన్ జర్నలిజం ఉత్తీర్ణులు కానీ అభ్యర్థులకు కు సప్లిమెంటరీ పరీక్షలు...




 "జర్నలిజం లో డిప్లొమా కోర్సు" సప్లిమెంటరీ పరీక్షలు
 ఆగస్టు 11 నుంచి 14 వరకు నాగార్జున యూనివర్సిటీ వారితో నిర్వహణ
 సి.ఆర్.మీడియా అకాడమి, చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్

పాత్రికేయులు, సాధారణ అభ్యర్థుల కోసం సి. ఆర్.మీడియా అకాడమి 2023-24 సంవత్సరంలో నిర్వహించిన "జర్నలిజం డిప్లొమా కోర్సు" సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తమ అభ్యర్ధన మేరకు అంగీకరించిందని చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కోర్సులో నమోదై, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేని అభ్యర్ధులకు మాత్రమే ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన నాలుగు పేపర్లకు (1. పత్రికలకు రాయడం, 2. ఎలక్ట్రానిక్ మీడియా నైపుణ్యాలు, 3. కొత్త మీడియా, 4. మీడియా చట్టాలు- నైతికాంశాలు) ఆగస్టు 11 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కాగోరే అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్ సైట్ www.anu.ac.in లో ఈ నెల 20 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 31-07-25 కాగా, రూ.100 అపరాధ రుసుముతో 02.08.25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం యూనివర్సిటీ కల్పించిందని తెలిపారు. పరీక్ష రుసుము రూ. 1000 (వెయ్యి రూపాయలు) అభ్యర్ధులు యూనివర్సిటీకి చెల్లించాల్సి వుంటుందన్నారు.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఏ.ఎన్ యూ ఆర్ట్స్ కాలేజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ అఫ్ హిస్టరీ) పరీక్ష కేంద్రంగా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

(సెక్రటరీ, సి.ఆర్.మీడియా అకాడమి, విజయవాడ వారిచే జారీ చేయబడింది)

49
7716 views