
బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కొడిమ్యాలలో ఘనంగా నిర్వహణ
కొడిమ్యాల, జూలై 22: సూర్యోదయం దినపత్రిక.
బీఆర్ఎస్ పార్టీ కోఓర్డినేటర్,కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రోజు కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామ చౌరస్తాలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేస్తూ వినోద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలను బీఆర్ఎస్ కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ముఖ్య అతిథులుగా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు,మండల పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,"తెలంగాణ రాష్ట్ర సాధనలో వినోద్ కుమార్ పాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది.కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలుస్తుంది"అని అన్నారు.అలాగే,"కేసీఆర్ కు కుడి భుజంలా ఉండి,రాష్ట్ర ఆవశ్యకతను దేశవ్యాప్తంగా వివరిస్తూ అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ ఏర్పాటులో తన మేధస్సుతో కీలక పాత్ర పోషించారు"అని కొనియాడారు.ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి,వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్రానికి,జిల్లాకు సేవలు అందించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్,మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి,కొడిమ్యాల సింగిల్ విండో డైరెక్టర్ పర్లపల్లి ఆనందం,పూడూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఈదురి అబ్రహం,మాజీ మండల అధ్యక్షులు గుండు హన్మయ్య,చింతపంటి ఆదయ్య,మాజీ సర్పంచులు ఒల్లాల లింగాగౌడ్,ఏగుర్ల తిరుపతి,గరిగంటి మల్లేశం,చెట్ పల్లి హరేందర్,బొడ్డు రమేష్,పిల్లి మల్లేశం,నరేష్,ల్యాగల రాజేశం,సురేష్ రావు బీరయ్య తదితరులు పాల్గొన్నారు.అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తూరి స్వామి,ఆకునూరి మల్లయ్య,చెల్ల లక్ష్మణ్,నీలగిరి విద్యాసాగర్ రావు,మహిళా విభాగ నాయకురాలు గాదే స్రవంతి,రైతు విభాగ అధ్యక్షులు బండి రాజేందర్ గౌడ్,బీసీ విభాగ మండల అధ్యక్షులు కుంట మల్లేశం,కార్యదర్శులు రమేష్ గౌడ్,రాజ్ పాల్,బీసీ విభాగ ప్రధాన కార్యదర్శి ఎండ్రికాయల శ్రీనివాస్,నాయకులు ఈదూరి మహేష్,రాచకొండ చంద్రమోహన్,ఎం.డి.ఆశీం సహా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.