logo

వార్డుల సంఖ్య పెంచండి ఎంపీవో ను కోరిన బుగ్గారం గ్రామస్తులు జడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి

వార్డుల సంఖ్య పెంచండి

ఎంపీవో ను కోరిన బుగ్గారం గ్రామస్తులు

జడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి

బుగ్గారం / జగిత్యాల జిల్లా :

బుగ్గారం గ్రామ పంచాయతీ లో పెరిగిన ఓటర్ల ప్రతిపాదికన వార్డుల సంఖ్య పెంచాలని మంగళ వారం బుగ్గారం గ్రామస్తులు స్థానిక ఎంపీవో, ఇంచార్జీ ఎంపిడివో అఫ్జల్ మియా ను కోరారు. మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్ ఆధ్వర్యంలో ఎంపివో అఫ్జల్ మియా కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న 12 వార్డు ల సంఖ్యను 16 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

వార్డుల సంఖ్య పెంచడానికి జడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు పంపాలని ఎంపివో, ఇంచార్జీ ఎంపిడివో అఫ్జల్ మియాకు వారంతా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్య క్రమంలో విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, పులిశెట్టి అమరేందర్, గంజి రాజన్న, కంచర్ల సురేందర్, ఏలేశ్వరం గౌరి శంకర్, జక్కుల బక్కన్న, చెట్ పల్లి ప్రభాకర్, సుంకం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

1
35 views