మచిలీపట్నం :అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని..?
మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. గతంలో ఆత్మకూరు–పామర్రు సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నాని తరఫున ముందస్తుగా బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ నడకపై ఇప్పుడు అనేక ఊహాగానాలు చెలామణి అవుతున్నాయి.
ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని అరెస్ట్ తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.