logo

నానో ఎరువులు వాడకానికి డ్రోన్లు వినియోగించాలి


రైతులకు ఉపయోగపడే విధంగా నానో ఎరువులు వాడకానికి డ్రోన్‌లను వినియోగించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ రూపొందించిన చీడ పురుగుల నుంచి పంటను కాపాడేందుకు దోహదపడే జీవన ఎరువుల ఆవశ్యకతను, నానో ఎరువులు ప్రచారం పోస్టర్‌, బ్రోచర్‌లను విడుదల చేశారు. జిల్లాకు మంజురైన 17 వ్యవసాయ డ్రోన్‌లను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు.

1
57 views