logo

విజయనగరంలో మహిళపై హత్యాయత్నం


విజయనగరం పట్టణంలో మహిళపై హత్యాయత్నం జరిగింది. జొన్నగుడ్డిలో నివాసం ఉంటున్న బంగారు భవానిపై సోమవారం వేకువజామున పొట్నూర్‌ తరుణ్‌ అనే వ్యక్తి చాక్‌తో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు భవానిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. భవాని అక్క మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు విజయనగరం వన్‌ టౌన్‌ సీఐ ఆర్‌విఆర్‌కె చౌదరి తెలిపారు.

9
693 views