విజయనగరంలో ముగ్గురి అరెస్ట్: సీఐ
విజయనగరం కొ త్రపీటనీళ్ళ ట్యాంకు వద్ద వ్యక్తిపై దాడి చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. రిటైర్డ్ ఎస్‌ఐ ముని బుచ్చిరాజు శనివారం అర్థరాత్రి కొత్తపీట జంక్షన్ నుంచి నడుచుకుని వెళ్తుండగా బొండపల్లి మండలం గుమడాంకు చెందిన తాడ్డి ప్రవీణ్, నెల్లిమర్ల మండలం గరికిపేటకు చెందిన తొంపల రాజేశ్, మరో బాలుడు దాడి చేశారని తెలిపారు. వారిని అరెస్టు చేశామన్నారు.