
*మీరు నా బలం... గుండెల్లోనే ఉన్నారు*– హరిహర వీరమల్లు ప్రీ-రిస్లీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ భావోద్వేగం
హైదరాబాద్, జూలై 21, 2025:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడికల్ డ్రామా "హరిహర వీరమల్లు" పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా, హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రీ-రిస్లీజ్ ఈవెంట్ అభిమానులతో సందడిగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన అభిమానులపై ఉన్న ప్రేమను చాటుతూ,
*నా దగ్గర ఆయుధాలు లేవు.. గుండాలు లేవు.. కానీ నా గుండెల్లో మీరు ఉన్నారు. మీరు నా బలం. మీరు ఉన్నంతవరకూ నేను ఎప్పటికీ నిలబడతాను,* అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న అభిమానులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. రాజకీయ బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా, అభిమానుల పిలుపుకు స్పందిస్తూ ఈ ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా ఆయన అభిమానుల గుండెల్లో మరింత స్థానం సంపాదించుకున్నారు.
*ఈ సినిమా భారతీయ జాతి గౌరవాన్ని చాటుతుంది. ఇది ఒక యోధుని గాథ. మన చరిత్రలో మర్చిపోయిన నాయకుడి ప్రస్థానం ఇది,”అని పవన్ వివరించారు.*
హరిహర వీరమల్లు చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.