
హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం – "ఓ డైమండ్ కోసం నానా తపాలు పడ్డాడు వీరమల్లు!"
హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగిన హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ఆయన చర్చించగా, క్లైమాక్స్‌లో కనిపించబోయే ‘డైమండ్’ గురించి చెప్పిన మాటలు ప్రేక్షకులను ఆలోచనలో ముంచెత్తాయి.
ఓ డైమండ్ కోసం వీరమల్లు ఎంత త్యాగాలు చేశాడో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అది కేవలం ఒక డైమండ్ కాదు – అది మన స్వాభిమానానికి, మన సాంస్కృతిక గౌరవానికి ప్రతీక."
ఈ మాటల ద్వారా ఆయన సినిమా ప్రధాన థీమ్‌ను హృదయానికి హత్తుకునేలా వివరించారు. ఇకపోతే, హరిహర వీరమల్లు పాత్రలో తాను నటించడమంటే ఒక యోధుడిగా మాత్రమే కాదు, ఒక భావోద్వేగంతో నిండిన దేశభక్తుడిగా నిలిచే పాత్ర అని చెప్పారు.
అలాగే తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ తెలుగు చరిత్ర, ధర్మం, దౌత్యం గురించి గొప్పగా ప్రస్తావించారు. "ఈ సినిమా మన యవతకు మన చరిత్రను గుర్తు చేయడానికి ఓ ప్రయత్నం" అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నిర్మాత ఏ ఎం రత్నంలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.