logo

మాతృసంస్థ CPI(ML)న్యూడెమోక్రసీ లో చేరిన కాంపాటి సత్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, కొమరారం గ్రామానికి చెందిన అరుణోదయ కళాకారుడు కాంపాటి సత్యం నేడు మాతృ సంస్థ cpi(ml )న్యూడెమోక్రసీ పార్టీలో చేరారు. ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరావు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావులు
కాంపాటి సత్యం కు ఎర్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ కాంపాటి సత్యం మొదటనుండి cpi(ml)న్యూడెమోక్రసీ పార్టీతో కలిసి పని చేసాడని, 2013 లో జరిగిన చీలికలో చంద్రన్న వర్గంలో చేరాడని అన్నారు. అరుణోదయ కళాకారుడుగా ప్రజలలో గుర్తింపు పొందాడని, 2020 వరకు చంద్రన్న వర్గంలో కీలకంగా పని చేస్తూ అనారోగ్య, ఆర్ధిక పరిస్థితి కారణంగా రాజకీయలకు దూరంగా ఉంటు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తూ వచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ప్రతిఘటన పోరాటాల వైపు కొనసాగాలని భావించి న్యూడెమోక్రసీలో చేరినాడని అన్నారు.
నేడు దేశంలో మతోన్మాద పాసిజానికి వ్యతిరేకంగా విప్లవకారులందరు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్న సమయంలో స్వార్ధ బుద్దితో కొందరు విప్లవ పార్టీని చిల్చడం సరైంది కాదని హితవుపలికారు. చీలికలు రాజ్యానికి ఉపయోగపడేవే తప్ప పేద ప్రజలకు ఉపయోగం లేదనే విషయం గుర్తుంచుకోవాలని చీలిక వాదులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ కొమరారం గ్రామకార్యదర్శి మోతిలాల్, మండల నాయకులు మాలు, క్రిష్ణ, అఖిల భారత రైతుకులి సంఘం (AIKMS)నాయకులు భద్రన్న, నరసన్న, మాజీ వార్డు సభ్యుడు పాపన్న, PYL నాయకుడు గుగులోత్ దేవా తదితరులు పాల్గొన్నారు.

134
4391 views