
సత్య సాయి సేవ సమితి*
_గచ్చిబౌలి_
🙏 *భగవాన్ సత్యసాయి శత ప్రత్యేక భజనలు🙏*
భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవంలో భాగంగా, గచ్చిబౌలి భగవాన్ శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో రోజుకొక భక్తుని ఇంట్లో, శత ప్రత్యేక భజనలు నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా ఉదయం ఓంకార నాదం నిర్వహించి, నగర సంకీర్తన చేస్తారు. తదనంతరం హారతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం స్వామివారి పాదపూజ, భజన, సత్సంగం, హారతి, తీర్థప్రసాదాల స్వీకరణ ఉంటుంది. ఇలా ప్రతిరోజు భగవాన్ సత్యసాయి బాబా గచ్చిబౌలి సమితి వారు నిర్వహించుట జరుగుతుంది. ఈరోజు భగవాన్ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవం లో భాగంగా శతభజనల నిర్వహణలో భాగంగా, ఆదర్శనగర్ కాలనీలోని తాడి బోయిన సాయి కృష్ణ యాదవ్ గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు డాక్టర్ బి సి రామన్న, రాహుల్ సాగర్, డివి కృష్ణారావు, వినయ్ సాయి, సుబ్బారావు గారు, ఎన్ శ్రీకాంత్, సాయి వెంకట్ రెడ్డి, సత్యప్రకాష్ గారు, శ్రీమతి గాయత్రి, శ్రీమతి ఉషారాణి, శ్రీమతి దీప్తి, శ్రీమతి డి సుజాత, శ్రీమతి సుజాత టాటా,దయాసాగర్ గారు, రత్న ప్రసాద్, శ్రీమతి శశి ప్రసాద్ గారు,భీమ్రావు గుప్తా, కృష్ణకుమార్ గారు పాల్గొన్నారు.