logo

మద్నూర్ మండల పద్మశాలి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

మద్నూర్ /జులై 20 ప్రతినిధి మస్నాజీ )

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పద్మశాలి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పద్మశాలి మండల అధ్యక్ష్యుడిగా ఉష్కల్వార్ శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. మండల అధ్యక్ష్యుడిగా ఎన్నికైన ఉష్కాల్ వార్ శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధి తో పాటు సమస్త వర్గస్థులకు అందుబాటులో ఉండి సామజిక సేవా భాగంగా మండల కమిటీ పాలక వర్గం కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పద్మశాలి వర్గస్థుల యొక్క ముఖ్యమైన అభిప్రాయాలను స్థానిక ఎమ్మెల్యే కాంతారావు దృష్టికి తీసుకోవెల్లి సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు .పద్మశాలి మండల కమిటీకి సమస్త గ్రామస్థులు సోషల్ మీడియా, చరవాణి, వాట్సాఫ్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విటర్ ద్వారా అభినందనాలు తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మద్నూర్ మండల పద్మశాలి కమిటీ ఈ విధంగా ఉన్నది, ఉష్కల్వార్ శ్రీనివాస్ (మండల అధ్యక్షుడు), కిషన్, రాజు (ఉపాధ్యక్ష్యులు) మెరిగే శ్రీనివాస్ ( ప్రధాన కార్యదర్శి ), రచ్చ కుషాల్, అందె సందీప్ (వర్కింగ్ ప్రెసిడెంట్ ), నాగేష్ దేవిదాస్, నాగనాథ్ (జాయింట్ సెక్రెటరీ ) లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ ఎన్నికల్లో మండల పద్మశాలి సభ్యులు పాల్గొన్నారు.

0
0 views