logo

తెలకపల్లి రచనలు ఆశయ పథం, అభద్ర, సజీవం పుస్తకాలవిష్కరణ సీనియర్ సంపాదకులు కె రామచంద్రమూర్తి ప్రశంస #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

తెలకపల్లి రచనలు ఆశయ పథం, అభద్ర, సజీవం పుస్తకాలవిష్కరణ సీనియర్ సంపాదకులు కె రామచంద్రమూర్తి ప్రశంస
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఆదివారం రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న బాలోత్సవ్ లో
సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి రచించిన ఆశయ పథం, అభద్ర, సజీవం పుస్తకాలవిష్కరణ సభకు ప్రజాశక్తి బుక్ హౌస్, సంపాదకులు ఎం వి ఎస్ శర్మ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సీనియర్ సంపాదకులు కె రామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలకపల్లి రవి చిన్ననాటి నుంచే సమాజం పట్ల, అభ్యుదయభావాల పట్ల అమితమైన ప్రేమ ఉండేదన్నారు. తన వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చిన భావాలను, బాధలను చిన్న చిన్న కవితల నుండి గీతాలను రాయడంలో మక్కువ పెంచుకున్నారు. అది ప్రవాహంలా కథలు, నవలలు, సాహిత్యంలోనూ, సమాజ పరిస్థితులలో వచ్చిన మార్పులలోనూ పట్టుసాధించేందుకుగా తోడ్పడుతూ, సీనియర్ జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకులుగా నేటికీ కొనసాగుతుందన్నారు. అందులో భాగంగానే సామాజిక ఉద్యమాల గీతాలు నుండి "ప్రజాగానం", వ్యక్తిత్వ వికాసం నుండి "మీరే ప్రేరణ మీదే సాధన", రవి రచించిన పుస్తకాల ఆవిష్కరణతోపాటుగా నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం ఆరుద్ర నుండి సంకలనాన్ని ఈ వేదికపైనే ఆవిష్కరించటం నాకు సంతోషాన్నిస్తుందన్నారు.

తెలకపల్లి రవి మాట్లాడుతూ, సాహితీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రం చేయాల్సిఉందన్నారు. గత సినిమాల్లో దైవాన్ని మానవీకరించడం చూశామని, ప్రస్తుతం మానవుడి గాధల్ని దైవీకరిస్తున్నారని, ఇది నవీన పురాణంగా పేర్కొన్నారు. ఈ పుస్తకాలు, ఇంకా రాబోయే అనేక రచనలు, కవిత్వాలు, పాటలు అన్ని కూడా ఒక పునర్వికాసానికి, పునఃప్రస్తానానికి దారితీస్తే నట్లు సంతోషిస్తానని చెప్పారు. దానికోసం ఒక క్రమపద్దతిలో ఈ పుస్తకాలను తీర్చిదిద్ది తీసుకువస్తానని చెప్పారు. సజీవం 2 కవితా సంపుటిని త్వరలోనే తీసుకువస్తానన్నారు.

ప్రజాశక్తి పూర్వ సిజిఎం వీ కృష్ణయ్య, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు బి తులసీదాస్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు కె ఆనందాచారి, సాహితీ స్రవంతి అధ్యక్షులు కెంగార మోహన్, సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ, కామ్రేడ్ జిఆర్ కె పోలవరపు సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, ప్రజానాట్యమండలి జగన్ లు రవి రచించిన పుస్తకాలను ఆవిష్కరణ చేశారు. అనంతరం వీరు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో లౌకిక కవనం వోర ప్రసాద్, ప్రజాశక్తి బుక్ హౌస్ కె లక్ష్మయ్య, సాహితీ స్రవంతి కె సత్యరంజన్, సాహితీ ప్రియులు, అభ్యుదయవాదులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

24
262 views